: జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది పొన్నాల కాదా?: కేసీఆర్


తెలంగాణలో త్వరలో అధికారం చేపట్టబోతున్న పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు తాను కితాబు ఇచ్చుకున్నారు. తాను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నానని ఆరోపిస్తున్నారని... న్యాయం చేయమని అడిగితే రెచ్చగొట్టినట్టా? అని ప్రశ్నించారు. పోలవరం డిజైన్ మార్చాలని, తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు కావాలని, తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని, ఉమ్మడి రాజధాని వద్దని, ఉద్యోగులను స్వస్థలాలకు పంపాలని తాము కేంద్రాన్ని అడిగామని... కానీ, ఏ ఒక్కదాన్ని అంగీకరించలేదని ఆరోపించారు.

రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణను కించపరిచినప్పుడు నోరు మూసుకుని ఉన్నారని టీమంత్రులపై కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని కిరణ్ అంటే... కనీసం ప్రశ్నించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో పొన్నాలపై కేసీఆర్ మండిపడ్డారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది పొన్నాల కాదా? అని ప్రశ్నించారు. కనీసం ఆయన జిల్లాలోని ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఏనాడైనా ఉద్యమం కోసం పొన్నాల పోరాడారా? అని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News