: సోనియమ్మా... నీ పాస్ పోర్టు చూపించు: అమెరికా కోర్టు
పాస్ పోర్టును చూపించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని అమెరికా కోర్టు కోరింది. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి సోనియాకు వ్యతిరేకంగా అమెరికాలో మానవహక్కుల ఉల్లంఘన కేసు దాఖలైంది. ఈ కేసు విచారణ బ్రూక్లిన్ కోర్టులో జరుగుతోంది. లోగడ కోర్టు సోనియాకు సమన్లు జారీ చేసింది. అమెరికాకు వచ్చిన సందర్భంగా సోనియాకు వీటిని అందజేసినట్లు విచారణాధికారులు పేర్కొన్నారు. కానీ, ఇవి తనకు అందలేదని, కేసును కొట్టివేయాలని సోనియా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గతేడాది సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు అమెరికాలో లేనట్లు నిరూపించడానికి వీలుగా పాస్ పోర్టు జిరాక్స్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇందుకు ఏప్రిల్ 7వరకు సమయం ఇచ్చింది. పాస్ పోర్టులో అమెరికాకు వచ్చి, వెళ్లిన ప్రతీ సందర్భాన్ని నమోదు చేస్తారు.