: ఇద్దరు సీఎంలు పక్కపక్కనే... కేటాయింపుల వివరాలు ఇవే


రెండు రాష్ట్రాల పరిపాలనా వ్యవహారాలు హైదరాబాదు నుంచే కొనసాగబోతుండటంతో మౌలిక వసతుల కేటాయింపులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. కొత్తగా భవన నిర్మాణాలు చేపట్టకుండా... ఉన్నవాటినే సర్దాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంలు పక్కపక్కనే ఉండబోతున్నారు. వీరి సర్దుబాటు కింద పేర్కొన్న విధంగా ఉండబోతోంది.

* సచివాలయంలో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ నుంచే తెలంగాణ ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తారు. డిప్యూటీ సీఎం కార్యాలయంగా ఉన్న సౌత్ హెచ్ బ్లాకును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కేటాయిస్తారు.
* టీ ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు, ఉద్యోగులు అమృత క్యాజిల్ గేటు నుంచి సచివాలయంలోకి రాకపోకలు సాగిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు, ఉద్యోగులు లుంబినీ పార్కు ఎదురుగా గల కొత్త గేటును ఉపయోగిస్తారు.
* ప్రస్తుత సీఎం క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసంగా కేటాయిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసంగా గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్ హౌస్ ను సిద్ధం చేస్తారు.
* మంత్రుల నివాసాల విషయానికొస్తే... ప్రస్తుతం ఉన్న క్వార్టర్లనే ఇరు ప్రాంతాలకు కేటాయిస్తారు. మంత్రుల సంఖ్యను ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు.
* హైదర్ గూడ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ఏపీ ఎమ్మెల్యేలకు... ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ను టీఎమ్మెల్యేలకు కేటాయిస్తారు.
* అసెంబ్లీ ఆవరణలోనే ఇరు రాష్ట్రాల శాసనసభ సమావేశాలు జరుగుతాయి.

  • Loading...

More Telugu News