: ఇది కుట్ర... రాహుల్ ని కలుస్తా: కావూరి
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించినందుకు, తనపై కక్షగట్టారని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఆరోపించారు. అందువల్లే తన సంస్థ ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్ ను తెరమీదకు తీసుకొచ్చారని అన్నారు. ఈ విషయంపై మాట్లాడటానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తానని తెలిపారు. తాము ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని వివరించారు.