: రూ. 350 కోట్లు బకాయిపడ్డ కావూరి సంస్థ.. చర్యలకు సిద్ధమైన ఎస్బీఐ
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన సంస్థ ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్ పై ఎస్బీఐ కొరడా ఝుళిపించడానికి సిద్ధమైంది. ఈ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 350 కోట్లు బకాయి పడి ఉంది. అయితే ఈ బకాయిలను తిరిగి చెల్లించడంలో ప్రోగ్రెసివ్ సంస్థ విఫలమైందని 'మింట్' అనే మీడియా సంస్థ వెల్లడించింది. ప్రోగ్రెసివ్ కంపెనీలో కావూరికి 41 శాతం వాటా ఉంది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కావూరి లోన్ తీసుకున్నారని బ్యాంకర్ల అసోసియేషన్ ఆరోపించింది. ప్రోగ్రెసివ్ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అసోసియేషన్ ఎలక్షన్ కమిషన్ ను కోరింది.