: ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయల్దేరిన పవన్ కల్యాణ్
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయల్దేరి వెళ్లారు. రేపు సాయంత్రం నరేంద్ర మోడీని పవన్ కల్యాణ్ కలుస్తారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల్లో నీటి వాటాల పంపకాలు, విద్య, వైద్యం, అభివృద్ధి తదితర అంశాలపై మోడీతో చర్చించనున్నారు.