: హాకీ ఇకపై 60 నిమిషాల ఆట


హాకీ క్రీడలో విప్లవాత్మక మార్పులకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) నడుం బిగించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 70 నిమిషాల మ్యాచ్ నిడివిని 60 నిమిషాలకు తగ్గించింది. అంతేగాకుండా, ప్రతి మ్యాచ్ ను 15 నిమిషాల నిడివితో నాలుగు భాగాలుగా విభజించింది. ఇంతకుముందు 35 నిమిషాలకు ఒక విరామం ఉండేది. ఈ నాలుగు భాగాల ఫార్మాట్ ను హాకీ ఇండియా లీగ్ పోటీల్లోనూ, యూరో హాకీ లీగ్ మ్యాచ్ లలోనూ ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

  • Loading...

More Telugu News