: బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీదే: బాబు


బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీదేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో బడుగుల అభివృద్ధిపై కేసీఆర్ ను నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. టీఆర్ఎస్ కు ఓ విధానం అంటూ లేదని అన్నారు. విశ్వసనీయత లేని పార్టీ టీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను ఎంత త్వరగా ఇంటికి పంపితే అంత మంచిదని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణకు విద్యుత్ కొరత రాబోతోందని, మౌలిక వసతుల సంగతి పక్కనబెట్టి మిగిలిన విషయాలు మాట్లాడుతున్నారని బాబు మండిపడ్డారు. తెలంగాణలో బీసీలే సీఎంగా ఉంటారని, దానిలో అనుమానం లేదని ఆయన స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు వేదిక టీడీపీ అని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News