: పాక్ ప్రధాని నెమలిని పిల్లి గుటకాయ స్వాహా... పోలీసులపై వేటు


పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పెంపుడు నెమలిని ఓ పిల్లి ఆరగించిందన్న కారణంతో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్ళపై వేటు పడింది. లాహోర్లోని రైవింద్ ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్ లో షరీఫ్ కొన్ని నెమళ్ళు పెంచుకుంటున్నారు. అయితే, ఓ పిల్లి లోపలకి చొరబడి ఒక నెమలిని గుటుక్కుమనిపించింది. నెమలి తాలూకు అవశేషాలు తోటలో పడి ఉండడాన్ని తోటమాలి గుర్తించాడు. దీనిపై ఎస్పీ అర్షద్ కు ఫిర్యాదు చేయగా, ఆయన, భద్రత విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ముగ్గురు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు.

దీనిపై స్పందించిన ఆ కానిస్టేబుళ్ళు, తాము ఆ సమయంలో విధుల్లోనే ఉన్నామని, నెమలిని పిల్లి తింటున్న విషయాన్ని గ్రహించలేకపోయామని వాపోయారు.

  • Loading...

More Telugu News