: కొనసాగుతున్న ఆపరేషన్ శేషాచలం
తిరుమల కొండల్లో ఆపరేషన్ శేషాచలం కొనసాగుతోంది. పాపవినాశనం పరిసరాల్లోని లోయల్లో మంటలు ఇంకా చల్లారలేదు. కుమారధార, పసుపుధార నుంచి హెలికాప్టర్లతో నీరు తీసుకెళ్లి మంటలను ఆర్పుతున్నారు. ఈ కార్యక్రమంలో 3 హెలికాప్టర్లు పాలుపంచుకుంటున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మంటలు చల్లారకపోవడంతో ఆపరేషన్ రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది.