: పాక్ జట్టుకు ధైర్యం నూరిపోస్తున్న మాజీ కెప్టెన్
భారత్ తో రేపు టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనున్న పాకిస్తాన్ జట్టుకు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ధైర్యం నూరిపోస్తున్నాడు. టీమిండియాను ఓడించాలంటే ధైర్యంగా ఉండడమే కీలకమని ఇమ్రాన్ ఖాన్ అంటున్నాడు. ఓటమి భయంతో బరిలో దిగారంటే ఎన్నో సమస్యలు తప్పవని హెచ్చరించాడు. బలాబలాల పరంగా భారత్ కంటే పాక్ జట్టే మెరుగ్గా కనిపిస్తోందని, అయితే, కీలక పోరులో సానుకూల దృక్పథం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డాడు.