: పాపం టీమిండియా క్రికెటర్లు!
టూర్ లను ఎంజాయ్ చేయడంలో టీమిండియా క్రికెటర్ల తరువాతే ఎవరైనా అని అంతర్జాతీయ క్రికెటర్లు అంటుంటారు. యువకులతో భారత క్రికెట్ జట్టు విదేశాల్లో ఆడేందుకు వెళితే, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారనేది జగమెరిగిన సీక్రెట్. అక్కడ పబ్బుల్లో, క్లబ్బుల్లో మందేసి చిందేయడంలో మన తరువాతే ఎవరైనా. అయితే ఎక్కడా హద్దులు మీరకపోవడం భారతీయ క్రికెటర్ల హుందాతనానికి నిదర్శనం. కొంతమంది మేనేజ్ మెంట్ కి చెప్పా పెట్టకుండా పబ్బుల్లో, క్లబ్బుల్లో ఎంజాయ్ చేసి వచ్చి వివరణలు ఇస్తుంటారు అది వేరే విషయం అనుకోండి.
ఈ సారి టీ20 టోర్నీలో మాత్రం భారత క్రికెటర్ల పప్పులు ఉడకేలా లేవు. ముస్లిం సంప్రదాయాలను అనుసరించే ఢాకాలో నైట్ క్లబ్బులు, పబ్బులు ఉండవు. దీంతో ఆటగాళ్లంతా గ్రౌండ్, హోటల్ కు పరిమితమవుతున్నారు. అయితే ప్రాక్టీస్ లేకుంటే హోటల్ రూముల్లో వీడియో గేమ్స్, ఛాటింగ్ లతో కాలక్షేపం చేస్తున్నారని సమాచారం.