: కేట్ విన్ స్లెట్ అందం వెనుక రహస్యం ఇదా?
హాలీవుడ్ లో అందమైన నాయికలలో కేట్ విన్ స్లెట్ ఒకరు. అలాంటి విన్ స్లెట్ అందం వెనుక రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. కృత్రిమ అలంకరణ కంటే సహజత్వమే హుందాగా ఉంటుందని 'టైటానిక్' సినిమాతో యువతను ఉర్రూతలూగించిన కేట్ విన్ స్లెట్ తెలిపింది. తనకు మేకప్ తో ఉండడం అస్సలు ఇష్టం ఉండదని చెప్పింది. నటిగా ఇంత పేరు సంపాదించినా సాధారణంగా, గృహిణిలా ఉండడమే ఎంతో హాయినిస్తుందని అంటోంది.
అందంగా ఉండాలంటే ఏం చేయాలని తనను చాలా మంది అడుగుతుంటారని, అలాంటి వారికి మనసును నిర్మలంగా ఉంచుకోవాలని సూచిస్తానని చెప్పింది. అలాగే సమయానుకూలంగా వ్యవహారాలు చక్కదిద్దుకోవాలని కూడా సూచించింది. తన పదమూడేళ్ల కుమార్తె కూడా 'అమ్మా, నీ అంత అందంగా ఉండాలంటే ఏం వాడాలి? అని అడుగుతుందని కేట్ తెలిపింది.
అందం కోసం అడ్డమైన క్రీములు వాడొద్దని, సహజమైన పదార్థాలతో చేసిన ఏదో ఒక మంచి క్రీమును ఎంచుకోమని సలహా ఇస్తానని కేట్ తెలిపింది. కేట్ ఏ క్రీము వాడుతుందో తెలియకపోయినా సహజమైన పదార్థాలతో తయారైన క్రీము వాడుతుందని మాత్రం తెలిసింది. ఈసారి ఆ క్రీమేంటో కూడా తెలుసుకుందాం!