: మా అన్వేషణకు ఒక కీలకమైన ఆధారం లభించింది: మలేసియా
అదృశ్యమైన విమానం అన్వేషణకు ఒక కీలకమైన ఆధారం లభించిందని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. కౌలాలంపూర్ లో మలేసియా రక్షణ శాఖ మంత్రి హిషముద్దీన్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొన్న అంశాలను ఆధారం చేసుకుని తమ అన్వేషణ నిర్దేశిత మార్గంలో సాగుతుందని అన్నారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించిన శకలాలు మలేసియా విమానానివే అని నిర్ధారించే వరకు అన్వేషణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
13 రోజుల క్రితం గల్లంతైన విమానం కోసం అన్వేషించే కార్యక్రమంలో 18 ఓడలు, 29 విమానాలు, 6 హెలికాప్టర్లు పాలుపంచుకుంటున్నాయి. దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ, మధ్య ఆసియా వరకు రెండు కారిడార్లు జల్లెడపడుతున్నాయని ఆయన తెలిపారు.