: బీజేపీలో సంక్షోభమా? లేదే... : వెంకయ్య నాయుడు
లోక్ సభ స్థానాల కేటాయింపు వ్యవహారం బీజేపీలో గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో సీనియర్ నేత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. పార్టీలో సంక్షోభం ఏమీ ఏర్పడలేదని, పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని చెప్పారు. సీనియర్ నేత అద్వానీ గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీచేయడం లేదని ఎవరు చెప్పారని వెంకయ్య ప్రశ్నించారు. అద్వానీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడి ఉంటే దానిపై చర్చిస్తామని తెలిపారు. ఈ సాయంత్రం అభ్యర్థుల విషయంలో పార్టీ తరపున సాధారణ ప్రకటన చేస్తామని, దీంతో, సందేహాలన్నీ పటాపంచలు అవుతాయని పేర్కొన్నారు.