: బీజేపీ నేతలకు 'టెర్రర్' ముప్పేమీలేదు: షిండే
తమకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న బీజేపీ నేతల భయాలను కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తోసిపుచ్చారు. బీజేపీ నేతలపై ఉగ్ర దాడులు జరగొచ్చన్న సమాచారమేదీ తమవద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. జైల్లో ఉన్న ఐఎం సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను విడిపించుకునేందుకు టెర్రరిస్టులు సీనియర్ రాజకీయనేతలను కిడ్నాప్ చేయనున్నారని మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.