: గత రికార్డులతో ఉపయోగంలేదు: ధోనీ
టీ20 వరల్డ్ కప్ లో రేపు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనుండగా అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ, గత రికార్డులతో ఉపయోగం లేదని, ఏ మ్యాచ్ కు ఆ మ్యాచ్ ప్రత్యేకమని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం జరిగే మ్యాచ్ కూడా అన్ని మ్యాచ్ ల వంటిదేనని, దానిపై ఇంతకంటే ఏమీ మాట్లాడబోనని పేర్కొన్నాడు. 2012 టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో భారత్ ఓడినా అది లీగ్ మ్యాచ్ లోనే. ఓ మేజర్ టోర్నీలో నాకౌట్ రౌండ్లలో భారత్ ఎన్నడూ దాయాది చేతిలో పరాజయం చవిచూడలేదు.