: మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగిపై నేరారోపణలు


మైక్రోసాఫ్ట్ కార్ప్ కు చెందిన మాజీ ఉద్యోగిపై నేరారోపణలు నమోదయ్యాయి. విండోస్ 8కు సంబంధించిన కాపీలను ఆన్ లైన్ ద్వారా ఓ బ్లాగర్ కు లీక్ చేసిన వ్యవహారంలో ఈ ఆరోపణలు నమోదు చేసినట్లు అమెరికా కోర్టులో సమర్పించిన డాక్యుమెంట్లు పేర్కొన్నాయి. రష్యా జాతీయుడైన అలెక్స్ కిబ్ కలో అనే వ్యక్తి గతంలో మైక్రోసాఫ్ట్ లో లెబనాన్, రష్యాలో పని చేశాడు. సంస్థ పరిశోధకుడిగా పని చేసిన అతను కంపెనీ రహస్య పత్రాలు, కొంత సమాచారాన్ని ఓ బ్లాగర్ కు బయటపెట్టినట్లు సీటెల్ ఫెడరల్ కోర్టు డాక్యుమెంట్స్ చెబుతున్నాయి.

అయితే, సదరు బ్లాగర్ ఎవరో ఇంకా గుర్తించలేదట. ఇంకా మార్కెట్ లోకి విడుదలకాని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసినప్పుడు తన గుర్తింపును హైడ్ చేశాడని, బ్లాగర్ క్యుబెక్ కు చెందినవాడినని తప్పుగా పేర్కొన్నాడని పత్రాల్లో వివరించారు. ఈ విషయాలన్నింటినీ మైక్రోసాఫ్ట్ అంతర్గత పరిశోధన వెల్లడించిందని, అంతేకాక రహస్య విషయాలన్నీ అలెక్స్ నుంచి బ్లాగర్ హాట్ మెయిల్ అకౌంట్ కు మెయిల్ ద్వారా వెళ్లినట్లు తెలిసిందట.

ఇక నుంచి జాగ్రత్తగా తమ సాంకేతిక విషయాలకు రక్షణ కల్పిస్తామని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు రాయిటర్స్ కు ఈ మెయిల్ ద్వారా తెలిపారు. విండోస్ సర్వర్ యాక్టివేషన్ కీలను అమ్మేందుకు కూడా ప్రయత్నించినట్లు కోర్టు డాక్యుమెంట్స్ తెలిపాయి.

  • Loading...

More Telugu News