: కేసీఆర్ మైండ్ గేమ్ మానుకో: కేఎల్ఆర్
టీఆర్ఎస్ కు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థుల కొరత ఉందని... అందుకే ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారని మేడ్చల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్), వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీధర్ మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకులను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు. మరి కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.... కేసీఆర్ ఇప్పటికైనా మైండ్ గేమ్ మానుకోవాలని హెచ్చరించారు. తమకు పార్టీని వీడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.