: ఇది భిన్న భావజాలాల నడుమ పోరాటం: రాహుల్ గాంధీ
దేశ ప్రజల ముంగిట నిలిచిన సార్వత్రిక ఎన్నికలు విరుద్ధ భావజాలాల మధ్య పోరాటమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సాధికారత కల్పించేందుకు నడుంబిగిస్తే, ప్రతిపక్షం కేవలం సంపన్న వర్గాలకే ప్రాతినిధ్యం వహిస్తోందని పేర్కొన్నారు. విపక్షం అజెండాలో పేదలకు ఏమూలా చోటు లేదని దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్ లోని టండా పట్టణంలో మాజీ సైనికులతో భేటీ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ సైనికుల డిమాండ్లను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.