: తెలంగాణలో హంగ్ ఏర్పడుతుంది: రేవూరి


తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను, ఎర్రబెల్లి పార్టీ మారుతున్నామని ప్రచారం చేసి టీఆర్ఎస్ లబ్ది పొందాలనుకుంటోందని విమర్శించారు. తామిద్దరం పార్టీ మారమని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ పాలక వర్గాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News