: మ్యాచ్ తర్వాత వికెట్లు పీకడం కుదరదిక!


ఓ క్రికెట్ మ్యాచ్ ముగిసిన తర్వాత గెలిచిన జట్టు ఆటగాళ్ళు వికెట్లు పీకి వాటిని ఆ పోరుకు గుర్తుగా దాచుకోవడం సాధారణం. ఆ స్టంప్ ఖరీదు మహా అయితే వందో రెండొందలో ఉంటుంది. కానీ, రేపటి నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్ కప్ లో వికెట్లు పీకుతామంటే కుదరదు. ఎందుకంటే, ఈ టోర్నీలో వెలిగే వికెట్లు ఉపయోగిస్తున్నారు. బంతి స్టంప్స్ కు తగలగానే అవి వెలుగుతూ ఆరిపోతూ సరికొత్త అనుభవాన్నందిస్తాయి.

వీటి పనితీరులానే వీటి ఖరీదు కూడా ఎక్కువేనండోయ్. వెలిగే వికెట్ల టెక్నాలజీ విలువ రూ.24 లక్షలట. వీటికి పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నామని ఈ వినూత్న వికెట్ల రూపకర్త బ్రాంటీ ఎకెర్మన్ తెలిపారు. వీటిని 'జింగ్స్' అని వ్యవహరిస్తారు. అన్నట్టు బెయిల్స్ కూడా వెలుగుతాయని, వీటి ఖరీదు ఓ ఐఫోన్ ధరకు సమానమని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News