: మెరైన్లు భారత్ వచ్చారు.. విదేశాంగ మంత్రిని ఇంటికి పంపారు!
నాటకీయ పరిణామాల మధ్య తిరిగి భారత్ వచ్చిన ఇటలీ నావికులు.. స్వదేశంలో విదేశాంగ మంత్రి రాజీనామాకు కారణమయ్యారు. కేరళ తీరంలో ఇద్దరు జాలర్లను చంపిన కేసులో రిమాండ్ లో ఉన్న ఇటలీ మెరైన్లు ఓటేసేందుకని స్వదేశం వెళ్లి అనంతరం ప్లేటు ఫిరాయించిన సంగతి తెలిసిందే. వారిని తిప్పి పంపాలన్న భారత్ ఆదేశాలను ఇటలీ ప్రభుత్వం భేఖాతరు చేసింది.
అయితే, అంతర్జాతీయంగా ఒత్తిళ్ళు రావడంతో ఆ ఇద్దరు నావికులను భారత్ పంపింది. ఈ నిర్ణయం అక్కడి ప్రభుత్వంలో భేదాభిప్రాయాలకు కారణమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నావికులను భారత్ కు పంపడం ఇష్టంలేని విదేశాంగ మంత్రి గులియో తేర్జి రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయం పట్ల బాధపడడం లేదని ఆయన ఇటలీ పార్లమెంటులో స్పష్టం చేశారు.

- Loading...
More Telugu News
- Loading...