: అతివిశ్వాసం ఎన్నికల్లో బీజేపీకి హాని చేస్తుంది: పవార్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, దేశానికి ఇక తదుపరి ప్రధాని తానేనని నమ్మకంగా వున్నారు. ఆయనతో పాటు పార్టీ కూడా ఈ విషయంలో అత్యంత విశ్వాసంతో ఉంది. దీనిపై స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మోడీది అతి విశ్వాసమని వ్యాఖ్యానించారు. 'భారత్ వెలిగిపోతోంది' (ఇండియా షైనింగ్) అన్న నినాదంతో 2004 ఎన్నికల్లో ఇలాగే ప్రచారానికి వెళ్లి భంగపడిందని పరోక్షంగా చురకలంటించారు. ప్రస్తుతం అతి విశ్వాసమే బీజేపీకి హాని చేయవచ్చని హెచ్చరించారు. బీజేపీ చేస్తున్న భారీ ప్రచారంతో ఎన్నికల్లో మేజిక్ మార్క్ ను చేరుతుందని తాననుకోవడం లేదని చెప్పారు.