: కేజ్రీ... మోడీని లక్ష ఓట్ల తేడాతో ఓడిస్తాడట!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షీలా దీక్షిత్ ను మట్టికరిపించిన అరవింద్ కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటుతారని ఆమ్ ఆద్మీ పార్టీ ఘనంగా విశ్వసిస్తోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వారణాసిలో కేజ్రీ చిత్తు చేయడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి.

ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్ నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేజ్రీవాల్ వారణాసిలో లక్ష ఓట్ల తేడాతో మోడీపై జయభేరి మోగిస్తారని ధీమాగా చెప్పారు. అంతేగాకుండా, మోడీకి దిగ్విజయ్ సింగ్ పోటీ ఇవ్వలేరని, సోనియా గానీ, రాహుల్ గానీ వారణాసి బరిలో దిగాలని సింగ్ సూచించారు. కాగా, వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాకున్నా, దిగ్విజయ్ సింగ్ అక్కడ పోటీ చేసేందుకు తన సమ్మతి తెలిపినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News