: తెలుగులో నాగార్జున 'కౌన్ బనేగా కరోడ్ పతి'
టీవీ రంగంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ రాబోతోంది. హిందీలో మెగాస్టార్ అమితాబ్ తన వ్యాఖ్యానంతో ఆ షోను ఎక్కడికో తీసుకెళ్లగా.. తెలుగులో ఆ పాత్రను నాగార్జున పోషించనున్నారని తెలిసింది. ఇందుకు ఆయన సమ్మతి తెలిపారని, ఈ ఏడాది చివరి నుంచి మా టీవీలో ప్రసారం కానుందని సమాచారం. తాను ఒక టీవీ షో నిర్వహించబోతున్నానంటూ నాగార్జున ఈ ఏడాది ప్రారంభంలో చెప్పిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.