: రాజకీయంగా పవన్ ప్రత్యర్థే: చిరంజీవి


తమ్ముడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై కేంద్ర మంత్రి చిరంజీవి ఈరోజు హైదరాబాదులో అర్థవంతంగా స్పందించారు. రాజకీయంగా మాత్రం పవన్ ను ప్రత్యర్థే అనుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ ను వేలెత్తి చూపుతున్న ప్రతి ఒక్కరూ తమకు ప్రత్యర్థులేనని స్పష్టం చేశారు. తమ్ముడు కల్యాణ్ ఆశయాలకు, ఆలోచనలకు స్వేచ్ఛ ఉందని, తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు.

ఇదే సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మండిపడ్డ చిరు, ఆయన బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఓట్లు దండుకోవటం కోసమే కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. భద్రాచలం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలిపేందుకు అధిష్ఠానం వద్ద కేసీఆర్ ఒప్పుకున్నారన్నారు. కేంద్రం నుంచి వచ్చే అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటామని, కార్యకర్తలో నూతనోత్సాహం నింపేందుకే బస్సు యాత్ర చేస్తున్నామని అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News