: మోడీ పీఎం అయితే రూపాయికి బూస్టే అంటున్న సిటీగ్రూప్


మోడీ పీఎం సీటులో కూర్చుంటే రూపాయికి బూస్ట్ వస్తుందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ సిటీగ్రూప్ అంటోంది. డాలర్ మారకంతో రూపాయి 40 నుంచి 45 స్థాయికి బలపడుతుందని సిటీ గ్రూపు ఆసియా పసిఫిక్ ప్రాంత చీఫ్ ఆదమ్ గిల్మౌర్ అంటున్నారు. యూపీఏ పాలనలో డాలర్ తో రూపాయి మారకం విలువ 40 స్థాయి నుంచి ఒక దశలో 70స్థాయి వరకు దిగజారి ప్రస్తుతం 60 స్థాయి వద్ద ఉంది. నరేంద్రమోడీ సారధ్యంలో బీజేపీ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు సాధిస్తుందంటూ పోల్ సర్వేలు వెల్లడువుతున్న నేపథ్యంలో.. అదే జరిగితే దీర్ఘకాలంలో రూపాయి 40 స్థాయి వరకు బలపడడానికి ప్రేరణనిస్తుందని ఆదమ్ చెప్పారు. బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వమే తాజా రూపాయి స్థితికి కారణమన్నారు. మోడీని గేమ్ చేంజర్ గా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News