: ములాయంకు అమర్ సింగ్ ఆఫర్.. ప్రచారం చేస్తానని ప్రకటన


వచ్చే ఎన్నికల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు ఇటీవల ఆర్ఎల్డీలో చేరిన అమర్ సింగ్ ఓ ఆఫర్ ప్రకటించారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో అజమ్ ఘర్ నుంచి పోటీ చేస్తున్న ములాయం తరపున తాను ప్రచారం చేస్తానని మీడియాకు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి బీజేపీ గెలుపొందడం తనకు ఇష్టం లేదని అందుకే అలా చెప్పానన్నారు. ములాయంతో విభేదాల కారణంగా ఎస్పీ నుంచి బయటికి వెళ్లి సొంత పార్టీ పెట్టుకున్న అమర్... గత నెలలో అజిత్ సింగ్ పార్టీ ఆర్ఎల్డీ పంచన చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News