: ఇక టీ కూడా ఘాటెక్కుతుంది
మీరు రోజూ కప్పుల కొద్దీ టీ తాగుతారా..! అయితే, మరికొద్ది రోజుల్లో మీకు టీపొడి ధరల పెంపు తాలూకు ఘాటు నషాళానికి అంటడం ఖాయం! సహజంగానే ఉత్పత్తి తగ్గడంతో తేయాకు ధరలు పెంచాలని నిర్ణయించారట. గతేడాది స్వల్పంగా పెరిగిన ధరలు ఈ ఏడాది చుక్కలనంటడం ఖాయమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
దేశంలో తేయాకును భారీ స్థాయిలో పండించే రాష్ట్రాలైన అసోం, బెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో గత మూడు నెలలుగా తగినంత స్థాయిలో వర్షపాతం నమోదవకపోవడంతో ఉత్పత్తి తగ్గినట్టు తెలుస్తోంది. అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో10-15 శాతం పెరగనుండగా, దక్షిణాదిలో మాత్రం 40-50 శాతం వరకు టీ ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. తాజా తేయాకు ధర ఉత్తరాదిలో 2012లో కిలో ఒక్కింటికి రూ. 170 ఉండగా, ఈ ఏడాది అది రూ. 200కి చేరింది.