: ఫైనల్లో తలపడేది భారత్, పాకిస్తాన్ జట్లేనంటున్న మాజీ కోచ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కోచ్ జెఫ్ లాసన్ టీ20 వరల్డ్ కప్ పై అల్ జజీరా మీడియాకు ఓ వ్యాసం రాశారు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఫైనల్ కు చేరుకునేది భారత్, పాకిస్తాన్ జట్లేనని అభిప్రాయపడ్డారు. ఈవెంట్ బంగ్లాదేశ్ లో జరుగుతున్నందున ఉపఖండం పరిస్థితులు ఈ రెండు జట్లకే ఎక్కువ అనుకూలిస్తాయని లాసన్ సూత్రీకరించారు. బలాబలాల పరంగానూ రెండు జట్లు ఒకదానికొకటి తీసిపోవని, ఇరుజట్లలోనూ మ్యాచ్ ను మలుపుతిప్పగల ఆటగాళ్ళకు కొదవలేదని పేర్కొన్నారు. కాగా, భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రేపు జరిగే మ్యాచ్ తో టీ20 వరల్డ్ కప్ మెయిన్ డ్రా పోరు ఆరంభమవుతుంది. ఇప్పటికే దాయాదుల మ్యాచ్ ను 'ఫైనల్ కాని ఫైనల్' అంటూ క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.