: అళగిరికి గాలం వేస్తున్న బీజేపీ


సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సంపాదించుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటడం తప్పనిసరి. ఈ విషయం కమలనాథులకు తెలియంది కాదు. అందుకే వారు తమిళనాడులో మిత్రబృందాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే విజయకాంత్ డీఎండీకేతోనూ, పీఎంకేతోనూ సన్నిహితంగా మెలుగుతున్న బీజేపీ తాజాగా డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు అళగిరితో స్నేహం కోసం ఆరాటపడుతోంది.

పార్టీ వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో డీఎంకే అళగిరిని బహిష్కరించడం తెలిసిందే. ఇప్పుడు ఈ కరుణ తనయుడిని మంచి చేసుకుంటే డీఎంకే అసమ్మతివర్గం అంతా తమకే మద్దతు పలుకుతుందన్నది బీజేపీ ఆలోచన. ఇప్పటికే అళగిరి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకే తన మద్దతు అని బహిరంగంగా ప్రకటించడం కాషాయదళానికి మరింత ఉత్సాహాన్నిస్తోంది.

  • Loading...

More Telugu News