: లోక్ సభకు పోటీ చేయనున్న జేపీ
లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని సూచనలొస్తున్నాయని, అందుకే లోక్ సభకు పోటీ చేయనున్నానని చెప్పారు. కాగా, సాధారణ ఎన్నికల్లో లోక్ సత్తా పరిమిత స్థాయిలోనే పోటీ చేస్తుందని చెప్పారు. రాజకీయ పొత్తులపై విధాన పత్రం విడుదల చేస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇరు ప్రాంతాలకు ప్రయోజనమని చెప్పారు.