: టీడీపీలో చేరుతున్నా: వీరశివారెడ్డి
రాయలసీమలో మరో కీలక కాంగ్రెస్ నేత సైకిలెక్కబోతున్నారు. కడపజిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేయగల సత్తా కేవలం చంద్రబాబుకే ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ విజయపతాకం ఎగురవేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. మరో వైపు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై వీరశివా విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు వైయస్సే అని కుండబద్దలు కొట్టారు.