: భారత క్రికెట్ జట్టుకు విశాఖ అమ్మాయి ఎంపిక
రాష్ట్ర క్రికెట్ క్రీడాకారిణి వి. స్నేహదీప్తి భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన స్నేహదీప్తి కుడిచేతి వాటం బ్యాట్స్ ఉమన్. ఇటీవలే ముగిసిన బీసీసీఐ ఇంటర్ జోనల్ మహిళల అండర్-19 క్రికెట్ టోర్నీలో స్నేహదీప్తి విశేషంగా రాణించింది. ఆ టోర్నీలో స్నేహదీప్తి ప్రాతినిధ్యం వహించిన సౌత్ జోన్ జట్టు రన్నరప్ గా నిలిచింది. జట్టు ఫైనల్ చేరడంలో ఈ విశాఖ అమ్మాయిదే కీలకపాత్ర.