: శ్రీవారిని దర్శించుకున్న నటుడు సూర్య
తిరుమల శ్రీవారిని సినీ నటుడు సూర్య దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ దర్శన సమయంలో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తర్వాత సూర్యకు పూజారులు ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం బయటికి వచ్చిన ఆయనను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు అక్కడివారు పోటీ పడ్డారు.