: విశాఖకు మెట్రో రైలు!
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణానికి త్వరలో మెట్రో రైలు రానుంది. 'మెట్రో రైలు విధానం' మేరకు మెట్రో ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సవరించిన మెట్రో రైలు విధానం మేరకు 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 10 లక్షల జనాభా దాటిన విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే, ఇకనుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటాతో ప్రాజెక్టును చేపట్టాలని నిబంధన తెచ్చారు. డీపీఆర్ తయారు చేసే కమిటీకి విధివిధానాలు సిద్ధం చేయాలంటూ విశాఖపట్టణం నగర పాలక సంస్థ కమిషనర్ కు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తాజాగా సూచించినట్లు సమాచారం.