: వివాహితపై ఆటవిక చర్య
ఒక వివాహిత పట్ల ఓ మృగాడు దారుణంగా ప్రవర్తించాడు. మధ్యప్రదేశ్ లోని రాయ్ సేన్ జిల్లా కాచికనకేడ గ్రామంలో 22ఏళ్ల వివాహిత మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన సౌదాన్ సింగ్(40) ఆమెపై అత్యాచారం చేశాడు. ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించి వెళ్లిపోయాడు. అయితే, జరిగిన విషయాన్ని ఆమె గ్రామస్థులకు చెప్పింది. దీంతో ఆగ్రహోదగ్రుడైన సౌదాన్ అదేరోజు నేరుగా బాధితురాలి ఇంటికే వెళ్లాడు. ఆమెను జట్టుపట్టుకుని వీధిలోకి లాక్కొచ్చాడు. వివస్త్రను చేశాడు. గ్రామస్థులు అడ్డుకోబోగా.. వారిపై కూడా దౌర్జన్యానికి ప్రయత్నించాడు. ఈ లోపు భర్త అక్కడకు చేరుకుని ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు నిందితుడు సౌదాన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.