: ఆ శునకం ఖరీదు రూ. 12 కోట్లు
ఇది నిజం. మాస్టిఫ్ జాతికి చెందిన ఆ కుక్క ఖరీదు అక్షరాలా రూ. 12 కోట్లు. పేరుకే ఇదొక కుక్క... చూడ్డానికి మాత్రం సింహంలా ఉంటుంది. ఈ శునకం వయసు ఏడాదిన్నర, బరువు 90 కిలోలు, ఎత్తు 80 సెంటీమీటర్లు. ఇలాంటి కుక్కలు చాలా అరుదుగా ఉంటాయి. అందుకే చైనాకు చెందిన ఓ వ్యక్తి ఈ కుక్కను అంత ధర పెట్టి ఇటీవలే కొనుక్కున్నాడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కుక్కగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. మాస్టిఫ్ జాతి కుక్కలను పెంచుకోవడం చైనాలో ఓ స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు.