: వామపక్షాల దీక్ష భగ్నం చేసిన పోలీసులు
విద్యుత్ సమస్యపై వామపక్షాలు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిరవధిక దీక్షకు ఉపక్రమించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని, గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్ సంక్షోభంపై సర్కారు తీరును నిరసిస్తూ వామపక్షాలు గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.