: అద్వానీని బుజ్జగిస్తున్న మోడీ
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానం తనకు కేటాయించలేదని బీజేపీ అగ్రనేత అద్వానీ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు అద్వానీని బుజ్జగిస్తున్నారు. అయినా ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. కాసేపటి క్రితం ఢిల్లీలోని అద్వానీ నివాసానికి మోడీ చేరుకున్నారు. తనకు గాంధీనగర్ స్థానం ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో అద్వానీకి మోడీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అద్వానీకి గుజరాత్ లోని గాంధీనగర్ స్థానాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే.