: మరికొద్ది సేపట్లో ఆపరేషన్ శేషాచలం.. రేణిగుంట చేరుకున్న హెలికాప్టర్లు
అగ్నికి ఆహుతవుతున్న తిరుమల కొండల్లోని అడవులను కాపాడేందుకు ఆపరేషన్ శేషాచలం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. రెండు రోజుల క్రితం మొదలైన మంటలు శేషాచలం అడవులను దహించేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర గవర్నర్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్లు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇక్కడి నుంచే ఆపరేషన్ శేషాచలం ప్రారంభం కాబోతుంది. ఇందులో 100 మంది సైనికులు పాల్గొంటారు. ఆక్టోపస్, జాతీయ విపత్తు నివారణ సంస్థ, నావికా దళాలు కూడా రేణిగుంటకు చేరుకున్నాయి. వాయుసేన, నేవీకి చెందిన హెలికాప్టర్ల ద్వారా రసాయనాలను జార విడుస్తూ మంటలను ఆర్పే ప్రయత్నం చేయనున్నారు.