: విమాన శకలాలు గుర్తించాం: ఆస్ట్రేలియా ప్రధాని


కనిపించకుండా పోయిన మలేసియా విమానానికి సంబంధించి ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ సరికొత్త సమాచారాన్ని అందించారు. దక్షిణ తీర ప్రాంతంలో రెండు విమాన శకలాలను గుర్తించామని ఆయన మలేసియా ప్రధానికి ఫోన్ లో వెల్లడించారు. ఈ శకలాలు గల్లంతైన మలేసియా విమానానివే అని భావిస్తున్నారు. అయితే ఇవి మలేసియన్ విమానానివే అని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అబ్బోట్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News