: ఏప్రిల్ 1 నుంచి లారీలు రోడ్డెక్కవు!


తమ డిమాండ్లు పరిష్కరించని నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని భారత రవాణా వాహనాల సంఘం (ఏఐఎంటీసీ) హెచ్చరించింది. మొత్తం 75 లక్షల లారీలు, 40 లక్షల బస్సులు ఏవీ రోడ్డెక్కవని ఏఐఎంటీసీ నాయకులు స్పష్టం చేశారు.

పెంచిన డీజిల్ ధరలు తగ్గించడం, మూడవపక్షం బీమా ప్రీమియం తగ్గించడం వీరి డిమాండ్లలో ముఖ్యమైనవి. రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి సానుకూల స్పందన కనిపించనందునే సమ్మె నిర్ణయం తీసుకున్నట్టు ఏఐఎంటీసీ నాయకులు తెలిపారు. ఈ విషయమై అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు నిష్ఫలమయ్యాయని వారు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News