: మున్సిపల్ ఎన్నికల్లో 17,795 మంది అభ్యర్థులు పోటీ


మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 17,795 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన ఆ వివరాలను ఇవాళ (బుధవారం) మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 146 మున్సిపాలిటీల్లోని 3990 వార్డుల్లో పోలింగ్ జరగనున్నదని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 1456 మంది బరిలో ఉన్నారని ఆయన తెలిపారు.

ఇక, జడ్పీటీసీలకు 273 నామినేషన్లు, ఎంపీటీసీలకు 3335 నామినేషన్లు దాఖలయ్యాయని నవీన్ మిట్టల్ తెలిపారు. వీటికి సంబంధించి నామినేషన్ల దాఖలుకు గురువారం సాయంత్రం 5 గంటలతో గడువు పూర్తవుతుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News