: భారత్ బ్యాటింగ్... రోహిత్ అవుట్
టీ20 వరల్డ్ కప్ సన్నాహకంగా టీమిండియా తన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. అయితే, ఇంగ్లండ్ బౌలర్ డెర్న్ బాచ్ ఓపెనర్ రోహిత్ శర్మ (5)ను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ మిర్పూర్ లో జరుగుతోంది. భారత్ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ ధావన్ (11 బ్యాటింగ్), కోహ్లీ (5 బ్యాటింగ్) ఉన్నారు.