: పరిటాల సునీత నాకు సోదరిలాంటిది: జేసీ


పరిటాల సునీత తనకు సోదరిలాంటిదని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, తనపై పరిటాల సునీతకు అపోహలు ఉన్నాయని, అవి ఎందుకు ఉన్నాయో తనకు తెలియదని అన్నారు. ఆమె తీరు ఎలా ఉన్నప్పటికీ, తనకు మాత్రం పరిటాల సునీత సోదరి లాంటిదని అన్నారు. తనకు ఎవరిపైనా శత్రుభావం ఉండదని, అందర్నీ కలుపుకుని పోవడమే తనకు తెలుసని ఆయన అన్నారు. తాను టీడీపీలో చేరడాన్ని ఆమె ఎందుకు వ్యతిరేకించారో తనకు తెలియదని, తనకు, ఆమెకు మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News