: కాలినడక దారిలో భక్తులను అనుమతిస్తున్నాం: టీటీడీ ఈవో


తిరుమల కొండకు కాలినడకన వచ్చే భక్తులను అనుమతిస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు. కాలి నడక దారిని పునరుద్ధరించనున్నట్టు ఆయన చెప్పారు. శేషాచల అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వల్ల మధ్యాహ్నం కాలినడక దారిని మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే, అగ్నిప్రమాద నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తిరుమల శ్రీవారిని ప్రశాంతంగా దర్శించుకోవచ్చునని ఈవో అన్నారు. టీటీడీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూముకు సమాచారం అందించాలని ఆయన కోరారు. కార్చిచ్చుపై సీఎస్, గవర్నర్ కు సమాచారం అందించామని ఈవో తెలిపారు.

  • Loading...

More Telugu News