: లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు భార్యనే హతమార్చాడు!


బ్రిటన్ లో ఓ భారత సంతతి వ్యక్తి తన శారీరక లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. జస్వీర్ రామ్ గిండే (29) అనే యువకుడికి వర్ఖా రాణి అనే యువతితో గత ఏడాది మార్చిలో వివాహం జరిగింది. గత ఆగస్టులో ఆమె భర్తతో కాపురం చేసేందుకు ఇంగ్లండ్ వచ్చింది. అయితే, గిండే స్వలింగ సంపర్కానికి మొగ్గు చూపేవాడు. భార్యతో సంసారం చేయలేక, నిజాన్ని దాయలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.

ఓ రోజు భార్య వర్ఖా రాణిని ఓ మెటల్ పైపుతో కొట్టి చంపాడు. అనంతరం శవాన్ని గార్డెన్ లోని చెత్త కుండీలో వేసి కాల్చేశాడు. ఇరుగుపొరుగు వారికి చెత్తను కాల్చానని బుకాయించాడు. అంతేగాకుండా, తన భార్య అలిగి వెళ్ళిపోయిందని పోలీసులకు తెలిపాడు. అనుమానమొచ్చిన పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ప్రస్తుతం ఈ కేసుపై వోల్వర్ హాంప్టన్ క్రౌన్ కోర్టులో విచారణ జరుగుతోంది.

  • Loading...

More Telugu News