: శ్రీరామనవమి ఎఫెక్ట్ ... ఆనాటి పోలింగ్ రెండు రోజుల ముందే!: రమాకాంత్ రెడ్డి
శ్రీరామనవమి రోజు నాటి స్థానిక సంస్థల ఎన్నికను ఏప్రిల్ 6న నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రానికల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఆయన చెప్పారు. అయితే ఎన్నికలు ఆపాలంటూ తమను ఆదేశించే అధికారం సీఈసీకి లేదని ఆయన తెలిపారు. శ్రీరామనవమిని దేశవ్యాప్తంగా వచ్చే నెల 8న జరుపుకోనున్నారు.